ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది కాబట్టి చల్ల గాలులకు ఆస్తమా ఉన్నవారికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.. ఈ ఆస్తమాతో ఇబ్బంది పడేవారికి దగ్గు, గురక ,గొంతులో పట్టేసినట్టు అనిపించడం, మాట్లాడేటప్పుడు ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఆస్తమాతో ఇబ్బంది పడేవారికి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ శీతాకాలంలో ఆస్తమా లక్షణాలను తగ్గించే చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో చాలామంది తీపి పదార్థాలు తయారు చేసేటప్పుడు తెల్ల చక్కెరకు బదులుగా బ్రౌన్ చక్కెర ను ఉపయోగిస్తున్నారు. ఈ బ్రౌన్ చక్కెర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.బ్రౌన్ షుగర్ లో మనకు  ఎటువంటి రసాయనాలు ఉండవు.. పైగా ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్‌,  ఐరన్‌,  మాంగనీస్,  సెలీనియం,యాంటీ ఆక్సిడెంట్స్,  విటమిన్ బి ఇలా ఎన్నో పోషక విలువలతో ఈ  బ్రౌన్ షుగర్‌లో నిండి వుంటుంది. ఇక బ్రౌన్ షుగర్ యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తుంది కాబట్టి బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఆస్తమా లక్షణాలకు చెక్ పెట్టడంలో ఈ  బ్రౌన్ షుగర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే ఈ బ్రౌన్ షుగర్ ను ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే.. ఒక కప్పు నీళ్ళు తీసుకొని స్టౌ మీద పెట్టి బాగా మరిగేటప్పుడు, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి, దంచిన అల్లం వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి. ఇలా ఉదయమే తాగడం వల్ల దగ్గు జలుబుతో పాటు ఆస్తమా లక్షణాలను కూడా అదుపులో పెట్టుకోవచ్చు. బ్రౌన్ షుగర్ వల్ల ఆస్తమా లక్షణాలు మాత్రమే కాదు.. అధిక బరువును కూడా దూరం చేసుకోవచ్చు. అంతే కాదు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా ఈ బ్రౌన్ షుగర్ తో దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: