ఇంకేముంది కొద్ది రోజులు ఆగితే వేసవికాలం రానే వస్తుంది.. ఒక వేసవి కాలం వచ్చింది అంటే ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక ఏసీలు , కూలర్లు కింద కూర్చుండి పోతున్నారు ప్రజలు. ఎక్కువ సమయం ఏసీలు , కూలర్లు కింద కూర్చోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే.. కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఇకపై ఏసీలు,  కూలర్లు లతో కూడా పనిలేదట. ఇక ఈ మొక్కలు మనకు చల్లటి గాలిని అందించడమే కాకుండా రోగాలను కూడా దూరం చేస్తాయట. మరి ఆ మొక్కలు ఏమిటో మనం కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం.

బెంజమిన్ ఫైకస్:ఈ మొక్కలను ఇంటి లోపల పెంచుకున్నట్లు అయితే గది వాతావరణాన్ని చల్లగా మార్చడమే కాకుండా బయట నుంచి వచ్చే వేడి గాలిని కూడా చల్లగా మార్చేస్తాయి. ఇక ముఖ్యంగా కాలుష్య గాలిని కూడా శుభ్రపరిచి మనకు మంచి ఆక్సిజన్ అందిస్తాయి.ఈ మొక్కలతో పెద్దగా ఖర్చు ఉండదు. చిన్నపాటి కుంపట్లలో కూడా పెరుగుతాయి కాబట్టి తెచ్చుకొని ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది.

బోస్టన్ ఫెర్న్ :ఈ మొక్కలు చెడు గాలిని శుభ్రపరచడంలో చాలాబాగా పనిచేస్తాయి. ఇంటిలోపల బయట నుంచి ప్రవేశించే విషపూరిత వాయువులను ఫిల్టర్ చేసి మంచి గాలిని మనకు అందిస్తాయి. ఇంట్లో వాతావరణాన్ని చల్లగా మార్చుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ మొక్కలకు సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.

స్నేక్ ప్లాంట్:మొక్కలలో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి వేడి గాలిని పీల్చుకుంటూ చల్లని గాలిని అందిస్తాయి. కిటికీ దగ్గర ఈ మొక్కలను పెంచితే వీటి గుండా వీచే గాలి చాలా చల్లగా అనిపిస్తుంది.

బాంబు ప్లాంట్:ఈ మొక్కలను ఇంటి ఆవరణంలో ఆఫీసులలో పెట్టడం వల్ల ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా చల్లదనాన్ని కూడా పెంచుతాయి. ఇక విషవాయువులను పీల్చుకునే శక్తి కూడా ఈ మొక్కలకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: