ఆయుర్వేదంలో  తెల్ల నేరేడు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వీటిని తినమని ఆయుర్వేదం  సూచిస్తుంది. ఈ పండ్లు వేసవికాలంలో తినడం వల్ల శరీరానికి శీతలీకరణ లక్షణాలు ఈజీగా అందుతాయి. అంటే ఈ పళ్ళు వడదెబ్బ నుంచి కాపాడతాయి. అలాగే వేడి సంబంధ అనారోగ్యాలను దూరంగా ఉంచుతాయి. మన శరీరంలో వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే డీహైడ్రేషన్ బారిన పడినవారు తెల్ల నేరేడును తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి అలసట వంటి లక్షణాలను పోగొడతాయి.వీటి రుచి తీయగా ఉంటుంది.ఇవి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. వీటిని తాజాగా  తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చాలా ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల వేసవిలో బ్యాక్టీరియా ఇంకా వైరస్ల వల్ల వచ్చే చాలా రోగాలు ఈజీగా తగ్గుతాయి.మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని శరీరానికి అందించాలనుకుంటే వేసవికాలంలో వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు తెల్ల నేరేడు పండ్లు తినడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి.


ఈ తెల్ల నేరేడు పండ్లలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా ఈజీగా పెరుగుతుంది. అలాగే మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను చాలా ఈజీగా సులభతరం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు  తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు ఎన్ని తిన్నా కూడా బరువు పెరుగుతామనే బెంగ ఉండదు.అందుకే మీరు దీన్ని చిరుతిండిగా తినవచ్చు. సలాడ్లు, డిసర్ట్ లలో ఈ తెల్ల నేరేడు పండ్లను మీరు వేసుకోవచ్చు.వీటిని తినడం వల్ల పేగుల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. వీటి ఆకారం అయితే గంటలా ఉంటాయి. ఈ పండ్లు లేత తెలుపు ఇంకా ఆకుపచ్చ కలిపిన చర్మంతో ఉంటాయి. ఇక పలుచటి చర్మాన్ని తీస్తే లోపల తెల్లటి గుజ్జు ఉంటుంది. ఇది చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఎంతో వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: