ఓ తల్లి ప్రమాదవశాత్తూ తన నలుగురు పిల్లల్ని చంపింది. ఎలా అంటే తమ పిల్లలు దగ్గు టానిక్ తాగాడానికి మారం చేస్తున్నారని.. సిరప్ ని పాలల్లో కలిపింది. వాటిని పిల్లలకు పట్టించింది. వాళ్లు వాటిని తాగిన తర్వాత నిద్ర పోయారు. మళ్లీ లేవలేదు. క్లినికల్ ట్రయిల్స్ పరిశీలించిన తర్వాత వాళ్లలో నలుగురు కూడా మంచంలోనే నిద్రలోనే చనిపోయినట్లు గుర్తించారు. దగ్గు టానిక్, పాల మిశ్రమం విషపూరితం కావడం వల్లే ఈ నలుగురి చనిపోయారని క్లినికల్ పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది.
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పోషిస్తున్న ఓ మాతృమూర్తి పిల్లల ఆరోగ్యం కోసం తెలియక చేసిన ఓ పని ఆమె నలుగురి పిల్లల చావుకి కారణమయింది. పాలల్లో మెడిసిన్ కలిపి తాగించడం మానేయండి. ఏ రసాయన సంకలనాలను కలిపి తాపించొద్దు. అది ప్రమాదకరంగా మారి ప్రాణాలు హరించే అవకాశాలు ఉన్నాయి. మనం ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఏదైనా సరే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం ఉత్తమం.
పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ప్రతిరోజూ పాలు తాగిస్తారు. ఈ క్రమంలో పలు పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని చేయకూడనవి.. చేయదగినవి తెలుసుకోని పాలు తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పాలతో పాటు రుచి కోసం కొందరు కొన్ని పదార్థాలను జత చేసి తినిపిస్తుంటారు. సిట్రస్ పండ్లు, అరటి పండ్లు పాలతో కలిపి ఇవ్వకూడదని సూచిస్తున్నారు. దీనివల్ల గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి