కరోనా వైరస్.. ఈ పేరు చెబితే ఒక్కరూ ఇద్దరు కాదు ఏకంగా ప్రపంచ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిపోయిన ఈ మహమ్మారి ఏకంగా ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగించింది. ఇక అందరిలో ప్రాణ తీపిని పెంచింది. ఏ క్షణంలో ప్రాణం పోతుందో అనే పరిస్థితికి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తీసుకువచ్చింది అని చెప్పాలి. అయితే ఇక అన్ని చోట్ల కూడా లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి కూడా వచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా ప్రపంచం మొత్తం ముసుగు చాటున ఉండి ఈ కనిపించని మహమ్మారిపై యుద్ధం చేసి విజయం సాధించగలిగింది. అయితే విజయం సాధించాము అని సంతోషపడే లోపే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రతి ఒక్కరిని మరింతగా భయపెడుతూ ఉన్నాయి. అయితే మొదట ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ తో పోల్చి చూస్తే ప్రమాదకరమైన వేరియెంట్లు ఎప్పటికప్పుడు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి అని చెప్పాలి. దీంతో కరోనా వైరస్ అంటే వచ్చిపోయేది కాదు జీవితాంతం ఈ వైరస్తో యుద్ధం చేయాల్సిందే అన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయింది అని చెప్పాలి.


 అయితే కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొన్ని తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక్కడ ఏకంగా ఈ వైరస్ సోకడంతో 15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయాయి. ఈ ఘటన యూఎస్ లో వెలుగులోకి వచ్చింది   కరోనాకు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ నాడి మండలం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడానికి ఇదే సంకేతం అంటూ వైద్యులు చెబుతున్నారు. బాలిక శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఆమె గొంతుకి  సంబంధించిన పక్షవాతం వచ్చినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు  అయితే ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు  దాదాపు 13 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగింది అని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: