
ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1 వేరియంట్ ను ఇంకా కన్ఫామ్ గా ప్రకటించలేదు.. అయితే ఈ కొత్త వేరియంట్ లక్షణాలు పెద్దగా భయపడాల్సినవిగా ఉండవు అంటూ ఆరోగ్య ఆధికారులు తెలియజేస్తున్నారు. కేవలం గొంతు నొప్పి, దగ్గు, జ్వరం అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. అలాగే రుచి, వాసన వంటివి కోల్పోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ ముఖ్యంగా చిన్నారులను, గర్భవతులను, వృద్ధులను, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని తెలుపుతున్నారు.
అయితే ఈ వేరియంట్ సోకిన వారెవరు కూడా ఐసీయూలో ఉండాల్సిన పని లేదంటూ తెలియజేస్తున్నారు. డాక్టర్ టీ జాకబ్ జాన్ తెలియజేస్తూ.. ఈ వేరియంట్ శ్వాసకోస ప్రభావం పైన చూపించే వేరియంట్ ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదని డాక్టర్ జాకబ్జాన్ తెలియజేశారు.. కానీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి హ్యాండ్ వాష్ చేసుకుని చేస్తూ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుపుతున్నారు. అయితే ఎవరైనా అనారోగ్యంగా అనిపించినట్లు అయితే బయటికి వెళ్లిపోయి మరి జాగ్రత్తలు పాటించడం మంచిది అని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ కరోనా వైరస్ ప్రజల మీద పెద్దగా ఇన్ఫాక్ట్ చూపదని తెలుపుతున్నారు.