ఒకప్పుడు పిల్లలు చక్కగా బయట ఆడుకునేవారు. అలా ఆడుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి మంచిది. అలాగే పిల్లలు కూడా బయట వాతావరణంలో ఆడుకోవడం వల్ల మెంటల్ గా కూడా చాలా బలంగా ఉంటారు. అందరితో కలిసి మెలిసి ఉండడం ఎలా అన్నది వాళ్ళకి తెలిసిద్ధి.. కానీ ఇప్పుడు పిల్లలు ఇండోర్ గేమ్స్ కి అలవాటు పడిపోయారు.అది ఎలా అనుకుంటున్నారో తెలుసా...!! మొబైల్ ఫోన్  లో మాత్రమే గేమ్స్ ఆడుతున్నారు.ఎంతసేపు ఇంట్లో ఉంటున్నారు.. లేదంటే ఫోన్ లోనే ప్రపంచం చూస్తున్నారు.. అంతేగాని బయట నలుగురితో ఆడుదాం అన్న ఆలోచన లేదు.. తల్లితండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. కానీ తల్లితండ్రులే పిల్లలకు మొబైల్ వినియోగంలో ఆదర్శంగా మారుతున్నారు.పిల్లలు మొబైల్ లో గేమ్స్ ఆడటం అనేది ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకుంటున్నారు.



తల్లితండ్రులు కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇంటికి వచ్చిన తర్వాత  ఈ మొబైల్ అనేది చేస్తూ ఉంటారు.లేదంటే  కాలక్షేపానికి ఉపయోగిస్తుంటారు. కానీ పిల్లలు ఇదే అదునుగా తీసుకుని  అదే మొబైల్ కావాలని ఏడవడం మొదలుపెడతారు.  వాళ్లకు మీరు ఇవ్వడం ఇదంతా మామూలైపోయింది అందుకోసమే ప్రతిసారి అలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఒక్కోసారి ఫోన్ అడిగిన వెంటనే ఇవ్వకపోతే  కొంతమంది పిల్లలు ప్రమాదాలు సృష్టించవచ్చు.


అలాగే మరికొందరు  పిల్లలు ఇవ్వకపోతే ఏదైనా చేయడానికి వెనకాడరు ఇంకా ఇంట్లో వస్తువులు పగలగొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళని అదుపులో ఉంచడం అనేది మంచిది.అందుకనే  తల్లిదండ్రులు అస్తమానం ఫోన్ చూడకుండా వంట చేయడం కానీ లేకపోతే ఏదైనా పని చేయడం కానీ చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు.ఆఫీస్ నుంచి రాగానే కొంచెం సేపు పిల్లలతో సమయం గడపండి. వీలయితే మీరే బయటకు వెళ్లి పిల్లలతో ఆడుకోండి. నలుగురితో ఎలా ప్రవర్తించాలో వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పండి.. ఒక్కసారి ఫోన్ అలవాటు అయితే మానడం చాలా కష్టం... !!

మరింత సమాచారం తెలుసుకోండి: