చాలామంది ఏ పనిలోనైనా విజయం సాధించగానే గర్వం నెత్తికెక్కించుకుంటూ ఉంటారు. గమ్యం చేరాక గర్వంతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టే. మనం ఎల్లప్పుడూ వినయం విజయానికి గుర్తు... గమ్యం నాశనానికి తొలి మెట్టు అని గుర్తుంచుకోవాలి. విజయం మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే... ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. 
 
గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినా సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే పదాలు మనిషిలో గర్వం, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు పదాలను మనసు నుండి దూరం చేస్తే జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా అసలైన విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 
 
విజయం, విధేయత, అణుకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు చేరుస్తాయి. గర్వం, అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, అహంకారం తలకెక్కించుకోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. ఈ రెండు లక్షణాలు లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: