ఏంటి మిరియాలలో కూడా కల్తీ నా అని ఆలోచిస్తున్నారా.. నిజమే..! అసలు కల్తీ లేని వస్తువు..కల్తీ లేని ఆహారం.. బహుశా ఈ భూమి మీద ఉండదు ఏమో.. సహజంగా పండించిన అప్పటికీ వ్యాపారస్తుల మాత్రం దానిని కల్తీ చేసేస్తున్నారు.. సొమ్ము చేసుకుంటున్నారు.. ఇకపోతే అప్పట్లో ఈ మిరియాలను బంగారం కంటే విలువైనవి గా చూసుకునే వారట. ముఖ్యంగా మిరియాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి.. ఇవి రుచికి చాలా ఘాటుగా అనిపించినా.. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు చేకూరడం గమనార్హం..


మిరియాల లో ఉండే పోషకాల విషయానికి వస్తే, యాంటీబ్యాక్టీరియల్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా మనకు బాగా లభిస్తాయి. ఇక ప్రతి రోజు ఈ మిరియాలను మనం తినే వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిలో కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని ఉదయాన్నే తీసుకుంటే సరిపోతుంది.. ఫలితంగా ఆకలి బాగా వేసి , సమయానికి తిన గలుగుతారు.. ఇక మిరియాలలో విటమిన్ ఎ, కెరోటిన్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.. ఇక మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా అడ్డుకుంటాయి.


ఇక మిరియాలు ఎలా కల్తీ అయ్యాయి అనే విషయానికి వస్తే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన విషయాన్ని బట్టి చూస్తే.. మిరియాలను బ్లాక్ బెర్రీస్ తో కల్తీ చేయవచ్చని సమాచారం.. అయితే ఇందుకోసం చేయవలసిందల్లా మిరియాలను తీసుకొని ఒక టేబుల్ మీద వేయండి.. ఇప్పుడు ఆ మిరియాలను  మీ వేళ్ళతో నొక్కండి. అయితే సులభంగా విరిగిపోతే అవి బెర్రీస్ అని, మిరియాలు అయితే  గట్టిగా ఉంటాయని గుర్తించాలి. కాబట్టి ఇలా మిరియాలు కల్తీ  అయ్యాయో లేదో చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: