
వెల్లుల్లి..
పచ్చి వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల, ఇందులోని అలిసిన్ అనే పదార్థము, నోట్లోని లాలజాలంతో కలిసి అలినిన్ గా మారి, లివర్ లోకీ వెళ్ళి ldl కొలెస్ట్రాల్ తయారవకుండా అడ్డుకుంటుంది. దీనితో గుండె జబ్బులు రాకుండా,మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.
పసుపు..
మనం వంటల్లో రోజు వాడే పసుపులో కరక్యూమిన్ అనే సమ్మేళనం ఉండడం వల్ల, రక్తనాళాల్లో పేరుకుపోయే ldl కొలెస్ట్రాల్ ని కరిగించి,రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దాల్చినచెక్క..
దాల్చినచెక్కను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల, ఇందులోని పాలిఫినాల్స్, సినానోసిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ldl కొలెస్ట్రాలను కరిగించి రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తగ్గిస్తాయి. దీనితో గుండెకు రక్తసరఫరా సక్రమంగా జరిగి, గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
కావున ప్రతి ఒక్కరూ వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.వీటితో పాటు, సరైన శారీరక శ్రమ, సరైన ఆహార అలవాట్లు,తగిన వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.