ఇటీవల కాలంలో చాలామంది ఆడవారిలో ఎక్కువగా కనిపించే సమస్య థైరాయిడ్.. వైద్యుల అంచనా ప్రకారం భారతదేశంలోనే దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు ఈ థైరాయిడ్ సమస్యతో అధికంగా బాధపడుతున్నారట. నిజానికి ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలోని ఎక్కువగా కనిపిస్తుంది. చెడు ఆహారాలు, శరీరశ్రమ లేకపోవడం, జీవనశైలి మార్పులు తదితర కారణాలవల్ల ఈ థైరాయిడ్ సమస్య అధికంగా వస్తోంది. కొన్నిసార్లు ఈ సమస్య కొంతమందిలో వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటుందట.

ముఖ్యంగా శరీర జీవక్రియలను నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంధి ఈ థైరాయిడ్ గ్రంధి.. గుండె , శ్వాస వ్యవస్థ , నాడీ,  జీర్ణ వ్యవస్థ , సంతాన ఉత్పత్తి వ్యవస్థ ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ ఎంతో ప్రభావితం చూపుతుంది.  ముఖ్యంగా థైరాయిడ్ వ్యవస్థలపై మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరులో కూడా రకరకాల మార్పులు వచ్చి హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం వంటి సమస్యలు వస్తున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం ఉన్నవారు అధిక బరువును కూడా నియంత్రణలోకి ఉంచుకోవచ్చు.

థైరాయిడ్ ఉన్నవారు బీన్స్, పప్పు దినుసులను తమ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. చెప్పాలంటే తాజా ఆకుకూరలు , కాయగూరలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ దుంపలు మాత్రం తీసుకోవడానికి ఆసక్తి చూపకండి... దుంపలు అంటే క్యారెట్ , బీట్రూట్,  ఆలుగడ్డ లాంటివి మన ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి.  కానీ థైరాయిడ్ వచ్చిన తర్వాత వీటిని మాత్రం అస్సలు తినకూడదట.  కానీ కొద్దిపాటి మొత్తంలో తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని సమాచారం. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గాలనుకుంటున్నట్లయితే నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి అలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి సమస్యను కంట్రోల్లో ఉంచవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: