
వాస్తు ప్రకారం రాత్రి సమయాలలో బట్టలు ఎప్పుడూ కూడా ఉతకకూడదట ఇలా చేయడం వల్ల అశుభం కలిగిస్తుందట. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టాన్ని కలిగించవచ్చు అంటూ తెలుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము. నీటికి సంబంధించిన పనులను రాత్రి సమయాల్లో చేయడం వల్ల ఇంటి సానుకూల శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. అంతేకాకుండా రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల శని ప్రభావం ఎక్కువగా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులు పేదరికం వంటివి కూడా పెరగవచ్చు.
వారంలో ఏడు రోజులు చాలా ముఖ్యమైనవి గురువారం రోజున విష్ణువుకి అంకితం చేయడం వల్ల ఆరోజు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆరోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా పూజిస్తారు కాబట్టి ఎవరూ కూడా మురికి బట్టలను ఆరోజు శుభ్రం చేయడం మంచిది కాదని తెలుపుతున్నారు. గురువారం రోజున బట్టలు ఉతకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేమని దీనివల్ల పేదరికం కూడా వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. బట్టలు ఉతకడానికి ఉత్తమ సమయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మంచిదని తెలుపుతున్నారు.. ఒక గురువారం మంగళవారం రోజున బట్టలు ఉతకపోవడమే మంచిదని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల కుటుంబంలో శాంతి, ఆనందం ,ఆర్థికంగా కూడా బలపడతారు.