
షుగర్ వ్యాధి లేదా మధుమేహం ఉన్నవారు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకించి, కూరగాయలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని కూరగాయలు షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తాయి.
షుగర్ వ్యాధికి కాకరకాయ ఒక మంచి మందు అని చెప్పొచ్చు. ఇందులో ఉండే కొన్ని పదార్థాలు షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే దీన్ని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండు కూరగాయలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఇది కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.
దొండకాయలో కూడా షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలు ఉన్నాయి. దీన్ని కూరగా లేదా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. టమాటలలో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. బీరకాయ, సొరకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమమైన ఆహారాలు.
మధుమేహం ఉన్నవారు పై కూరగాయలతో పాటు, వైద్యుడి సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవడం కోసం ఒక డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం అని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు