
రోజు ఉదయం వెల్లుల్లితో తేనెను కలిపి తీసుకోవడం వల్ల తుమ్ములతో పాటు గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేడి పాలలో పసుపు, మిరియాల పొడి కలుపుకుని తాగడం వల్ల తుమ్ములను తగ్గించుకోవచ్చు. అల్లం టీ తుమ్ములకు మంచి మందులా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో అల్లం వేసి మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేడినీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతులో ఉన్న క్రిములు తొలగిపోయి తుమ్ముల సమస్య తగ్గుతుంది. వేడి వేడి సూప్ తాగడం వల్ల కూడా ముక్కు దిబ్బడ తగ్గి తుమ్ములు తగ్గుతాయి. గదిలో ఉండే గాలిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దుమ్ము, ధూళి వల్ల కూడా తుమ్ములు వస్తాయి. వీలైనంత ఎక్కువగా వేడి నీటిని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది తుమ్ముల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొన్ని తులసి ఆకులను నమలడం లేదా టీలో కలుపుకుని తాగడం వల్ల తుమ్ముల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయం వెల్లుల్లితో తేనెను కలిపి తీసుకోవడం వల్ల తుమ్ములతో పాటు గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వేడి పాలలో పసుపు, మిరియాల పొడి కలుపుకుని తాగడం వల్ల తుమ్ములను తగ్గించుకోవచ్చు. అల్లం టీ తుమ్ములకు మంచి మందులా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో అల్లం వేసి మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చు.