రాత్రిపూట ఎంత తేలికగా తింటే అంత మంచిదని డాక్టర్లు తరచూ సూచిస్తుంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో మన శరీరపు జీర్ణ వ్యవస్థ, మెటబాలిజం మధ్యాహ్నం కంటే చాలా మందగిస్తుంది. అయినా కూడా కొంతమంది బిజీ జీవితంలో పగటిపూట సరైన సమయం దొరకకపోవడం వల్ల రాత్రివేళ ప్రశాంతంగా కూర్చొని బిర్యానీ, ఫ్రైడ్ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, డెజర్ట్స్ లాంటి హై-కేలరీ ఫుడ్ ఎక్కువగా తినేస్తారు. దీని వల్ల అవసరానికి మించి కేలరీలు శరీరంలో చేరిపోతాయి.
కాలక్రమేణా ఇవి కొవ్వు పేరుకుపోవడానికి, ఊబకాయం పెరగడానికి, బీపీ, షుగర్, హార్ట్‌అటాక్ వంటి సమస్యలు రావడానికి కారణమవుతాయి. అందువల్ల రాత్రి భోజనం ఎంత తేలికగా, ఎంత మితంగా చేస్తే అంత మంచిది అని వైద్యులు చెబుతున్నారు.


రాత్రిపూట పెరుగన్నం తినకూడదా?

చాలామంది రాత్రిపూట చేసుకోవడానికి ఓపిక లేకపోవడం వల్ల, మధ్యాహ్నం మిగిలిన అన్నంలో కొంచెం పెరుగు వేసుకొని తినేస్తుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరానికి అంత మంచిది కాదు. పెరుగు స్వభావం చల్లగా (శీతవికారి). రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గిపోతుంది. ఆ సమయంలో పెరుగన్నం తీసుకుంటే: జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. జీర్ణక్రియ దెబ్బతిని అజీర్ణం, వాంతులు, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉందట.



దీని వల్ల శ్వాసకోశ సమస్యలు రావొచ్చట. ఇది ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల ఆయుర్వేద నిపుణులు, పెద్దలు రాత్రిపూట పెరుగన్నం తినకూడదని పూర్తిగా నిరాకరిస్తారు. అయితే పెరుగును మజ్జిగ రూపంలో, కొంచెం సింపుల్‌గా తీసుకోవచ్చు అంటున్నారు పెద్దలు.



పెరుగును తీసుకోవడంలో సరైన పద్ధతి:

పెరుగు ప్రోబయోటిక్స్ కు అద్భుతమైన మూలం. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే దాన్ని సరైన రీతిలో తీసుకోవడం చాలా ముఖ్యం.

పెరుగులో కలిపితే ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు:

*వేయించిన జీలకర్ర పొడి – జీర్ణక్రియను బలపరుస్తుంది, గ్యాస్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.

*కొద్దిగా చక్కెర లేదా బెల్లం – రుచిని పెంచి శక్తిని ఇస్తుంది.

*ఒక చిటికెడు ఉప్పు – దాహం, అలసట తగ్గిస్తుంది.

జాగ్రత్తలు:

పెరుగు తీసుకోవడానికి ఉత్తమమైన సమయం మధ్యాహ్న భోజనం సమయంలో అని గుర్తుంచుకోండి. రాత్రిపూట తరచుగా పెరుగన్నం తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, దీర్ఘకాలంలో కాలేయం, ప్యాంక్రియాస్ వంటి అవయవాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు రాత్రిపూట పెరుగన్నం తింటే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ అలవాటుగా నెలలు, సంవత్సరాలు కొనసాగిస్తే సమస్యలు తప్పవు.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది డాక్టర్లు, ఆయుర్వేద గ్రంథాలు, అలాగే సోషల్ మీడియాలో లభ్యమవుతున్న ఆరోగ్య సూచనల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని పాటించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం అని పాఠకులు గుతుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: