
ప్రత్యేకంగా శుక్రవారం పూట ఆడవాళ్లు నిండుగా కనిపించడం చాలా శుభప్రదమని భావిస్తారు. చీర కట్టుకొని, తల నిండా పూలు పెట్టుకొని, నుదుట కుంకుమ పెట్టుకొని, చేతినిండా గాజులు వేసుకొని, కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో తిరుగుతున్న ముత్తైదువ స్త్రీని చూసినప్పుడు అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం లాగా అనిపిస్తుందని పెద్దలు అంటారు. అలా ఉంటే ఆ ఇంటిపై ఎల్లప్పుడూ మహాలక్ష్మి కటాక్షం ఉంటుందని చెబుతారు.
అయితే కొంతమంది శుక్రవారం పూట తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. ముఖ్యంగా— చేతిలో గాజులు తీయకూడదు, మెడలో తాళి తీసేయకూడదు,కాళ్ల మెట్టెలు తీయకూడదు,నుదుటి కుంకుమ పోకూడదు,కుంకుమ నేలపై పడకూడదు..ఇవి అన్నీ పెద్దలు, పండితులు సూచించే ఆచారాలు. ఇలా పొరపాటున జరిగిన ఓ అశుభంగా చెప్పుకుంటారు. ఇంటికి ఆడపిల్లె మహాలక్ష్మి..అందుకే ఆడవాళ్లు శుక్రవారం ఏడవద్దు అని చెప్పుతూ ఉంటారు. వాళ్లు ఏడిస్తే ఇంటికి కలిసి రాదు అనేది పెద్దల నమ్మకం..!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది పండితులు చెప్పిన ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీన్ని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం..!!