జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే మీ రోజువారీ ఆహారంలో కింది వాటిని చేర్చుకోవడం మంచిది. జుట్టు నిర్మాణానికి ప్రొటీన్ చాలా అవసరం. జుట్టు ఎక్కువగా ప్రొటీన్‌తోనే తయారవుతుంది. అలాగే బయోటిన్ (విటమిన్ B7) జుట్టుకు కీలకమైన 'కెరాటిన్' అనే ప్రొటీన్ తయారీకి తోడ్పడుతుంది.

వీటిలో ప్రొటీన్‌తో పాటు బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ గుడ్డు తినడం వలన జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా గ్రీక్ పెరుగులో ప్రొటీన్, విటమిన్ B5 ఉంటాయి, ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. చికెన్, సాల్మన్ వంటి చేపల్లో అధిక ప్రోటీన్, విటమిన్ Bలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి.

పాలకూరలో ఐరన్, విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్ (విటమిన్ B9) సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారికి జుట్టు రాలడం సర్వసాధారణం. పాలకూరలో ఉండే ఐరన్ ఆ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్ (విటమిన్ B9) సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారికి జుట్టు రాలడం సర్వసాధారణం. పాలకూరలో ఉండే ఐరన్ ఆ సమస్యను తగ్గిస్తుంది.

చిలగడ దుంప (స్వీట్ పొటాటో)లో  ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని శరీరం విటమిన్ A గా మారుస్తుంది. విటమిన్ A తలలోని గ్రంధులు సెబమ్ (సహజ నూనె) ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జామపండు, క్యాప్సికంలో  అధికంగా ఉండే విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తికి, ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బాదంలో బయోటిన్, విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, అవిసె గింజల్లో జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E వంటి పోషకాలు ఉండి జుట్టు రాలకుండా కాపాడుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: