శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గితే, రక్తస్రావాన్ని ఆపడం కష్టమవుతుంది. ఈ ప్లేట్‌లెట్స్‌ను పెంచడానికి ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు మరియు పదార్థాలను చేర్చుకోవడం చాలా అవసరం. విటమిన్-సి ప్లేట్‌లెట్స్ సమర్థవంతంగా పనిచేయడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నిమ్మ, నారింజ, ఉసిరి, కివీ విటమిన్ సికి అద్భుతమైన వనరులు అని చెప్పవచ్చు.
పైనాపిల్, దానిమ్మ, మామిడి, బొప్పాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్త కణాల ఉత్పత్తికి, ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ పెరుగుదలకు ఈ విటమిన్లు చాలా ముఖ్యమైనవి. పాలకూర, తోటకూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకుకూరలలో ఫోలేట్ అధికంగా ఉంటుంది.
వేరుశనగలు, బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లు, సాల్మన్ చేపలు, మాంసంలలో విటమిన్-బి12 ఎక్కువగా లభిస్తుంది. శాకాహారులు ఫోలిక్ ఆమ్లం ఉన్న ఆహారాలు లేదా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. గుమ్మడికాయలో ఉండే విటమిన్-ఎ ప్లేట్‌లెట్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీని రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు.
బీట్‌రూట్, దానిమ్మ రక్తహీనతను తగ్గించి, ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచడానికి సహాయపడతాయి. ఎండు ద్రాక్ష, అత్తి పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తినడం ఉత్తమం అని చెప్పవచ్చు. తగ్గిన ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచడానికి బొప్పాయి ఆకుల రసం ఒక ప్రసిద్ధ సహజ చిట్కా అని చెప్పవచ్చు. 4-5 బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి, ఆ మిశ్రమాన్ని తాగాలి. బొప్పాయి పండు తినడం కూడా మంచిదే.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి