జుట్టు నల్లగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం 'మెలనిన్' అనే వర్ణద్రవ్యం. ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా ఆగిపోయినప్పుడు జుట్టు తెల్లబడుతుంది. సాధారణంగా వయసుతో పాటు వచ్చే ఈ మార్పు.. కొంతమందిలో యుక్తవయసులోనే లేదా చిన్నప్పుడే మొదలవుతుంది. దీనిని 'చిన్న వయసులోనే తెల్ల జుట్టు' (Premature Greying of Hair) అంటారు.
తెల్ల జుట్టుకు అత్యంత ప్రధానమైన కారణం వారసత్వం. మీ తల్లిదండ్రులకు, లేదా వారి కుటుంబ సభ్యులకు చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఉంటే, మీకు కూడా ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం మానసిక ఒత్తిడి, ఆందోళనతో ఉండటం వల్ల మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు (మెలనోసైట్స్) క్షీణించి, జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంది.
పొగతాగడం (Smoking), అధికంగా మద్యం సేవించడం శరీరంలో 'ఆక్సిడేటివ్ స్ట్రెస్'ను పెంచుతాయి, ఇది జుట్టు రంగును దెబ్బతీస్తుంది. సరిగా నిద్ర లేకపోవడం కూడా ఒత్తిడిని పెంచి జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించినప్పుడు మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. విటమిన్ B12 లోపం తెల్ల జుట్టుకు ముఖ్య కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు.
ఐరన్, కాపర్, జింక్ ఈ ఖనిజాలు మెలనిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి లోపం కూడా సమస్యను పెంచుతుంది. శరీరానికి తగినంత ప్రొటీన్ అందకపోవడం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. హైపోథైరాయిడిజం (Hypothyroidism) లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. విటిలిగో (Vitiligo) లేదా అలోపేసియా ఏరియాటా (Alopecia Areata) వంటివి కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి