వైసిపి పార్టీలో సీనియర్ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ మధ్యకాలంలో తరచు ఎక్కడ చూసినా పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్లో కూడా ఈయన చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారుతుంటాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి. నారా లోకేష్ నిర్వహించిన రెడ్ బుక్ అంశం పైన స్పందిస్తూ ఒక విషయంలో తాను లోకేష్ ను మెచ్చుకుంటున్నట్లు కేతిరెడ్డి వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది.


చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ తాను అనుకున్నది చేయడంలో మొండిగా ముందుకు వెళ్తున్నారని ఇది రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికిందని విశ్లేషించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈ రెడ్ బుక్ విధానం ద్వారా లోకేష్ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అయితే ఇది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త పాఠాన్ని నేర్పించినట్టు అవుతోందంటూ హెచ్చరించారు కేతిరెడ్డి. లోకేష్ తీసుకు వచ్చిన ఈ సాంప్రదాయాన్ని జగన్ మరింత పదునుగా మార్చి భవిష్యత్తులో వాటిని మరింత గట్టిగా అమలు చేస్తారంటూ పరోక్షంగానే కౌంటర్ వేశారు. లోకేష్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని భవిష్యత్తులో వైసిపి కూడా ఆయుధాలుగా మార్చుకుంటుందని ఘాటుగా స్పందించారు .


అలాగే 2024 ఎన్నికలలో ఓటమిపై కేతిరెడ్డి మాట్లాడుతూ చాలా బాగా ద్వేగానికి లోనయ్యారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ వినూత్న కార్యక్రమాలతో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎన్నికలు ఫలితాలు తనకు వ్యతిరేకంగా రావడం పై చాలా బాధపడ్డానని తెలిపారు. ధర్మవరం రాజకీయాలలో 20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి కష్టపడన తనని కాదు అని కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన వ్యక్తి (మంత్రి సత్య కుమార్ యాదవ్) విజయం సాధించడం తనని తీవ్రంగా కలిసి వేసింది అంటూ తెలియజేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ లేనంత బాధ ఈ ఓటమి కలిగించిందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: