చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తక్కువ సమయంలోనే రాజకీయాల్లో ఎదిగిన నాయకుడు. కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన రంగనాథరాజు...2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009లో చెరుకువాడ ఎన్నికల బరిలో దిగలేదు....ఆ తర్వాత వైసీపీలో చేరిన చెరుకువాడ 2019 ఎన్నికలో ఆచంట నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

మామూలుగానే ఆచంట అంటే టీడీపీకి కంచుకోట. పైగా అక్కడ మాజీ మంత్రి పితాని సత్యనారాయణని ఓడించడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ చెరుకువాడ, జగన్ గాలిలో గెలిచేశారు. అలాగే గెలిచాక బంపర్ ఆఫర్ కూడా దక్కించుకున్నారు...జగన్ క్యాబినెట్‌లో మంత్రి పదవి కొట్టేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

మంత్రిగా చెరుకువాడ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఆయన గృహ నిర్మాణ శాఖలో అక్రమాలు ఎక్కువే అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల స్థలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అక్రమాలు జరిగాయో కూడా ప్రజలందరికీ తెలుసని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలే మంత్రిగా బాగా మైనస్ అయ్యాయి. మంత్రిగా మాత్రం అనుకున్న మేర మార్కులు తెచ్చుకోలేదు. ఇక ఎమ్మెల్యేగా ఆచంటలో పర్వాలేదనిపించేలా పనిచేసుకుంటున్నారనే చెప్పాలి...సంక్షేమ పథకాలు..చిన్నాచితక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కానీ మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గంలో భారీగా మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

అలాగే నియోజకవర్గంలో ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ఎక్కువనే ఆరోపణలు...తాగునీటి సమస్యలు. కొబ్బరి రైతుల ఇబ్బందులు...గ్రామాల్లో సరైన రోడ్ల వసతి లేకపోవడం లాంటి సమస్యలు ఎక్కువే. రాజకీయంగా వస్తే..చెరుకువాడ కాస్త వీక్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నేత పితాని పికప్ అవుతున్నారు. ఇక్కడ గానీ టీడీపీ-జనసేనలు కలిస్తే చెరుకువాడకు చెక్ పడటం ఖాయం. స్థానిక ఎన్నికల్లోనే టీడీపీ-జనసేనలు కలిసి వైసీపీకి చెక్ పెట్టాయి. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తు ఉంటే రంగనాథరాజుకు దెబ్బపడుతుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: