బిగ్ బాస్ తెలుగు సీజన్-3 లో ఫైనలిస్టులు అయిన శ్రీముఖి మరియు రాహుల్ సిప్లిగంజ్ కి ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకపక్క చాలా షో లకు మరియు ఆడియో ఫంక్షన్స్ కి శ్రీముఖి యాంకరింగ్ చేస్తుండగా రాహుల్ ఇంతకు ముందు కంటే ఎక్కువ సినిమాల్లో పాటలు పాడి అభిమానులను అలరిస్తున్నాడు. అయితే మొదటి నుండి మంచి స్నేహితులుగా కొనసాగిన శ్రీముఖి మరియు రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే శత్రువులుగా మారిపోయారు. మరీ ముఖ్యంగా సీజన్ చివరి అంకానికి వచ్చేటప్పటికి ఇద్దరూ బద్ద శత్రువులు గా మారిపోగా చివరికి టైటిల్ ను రాహుల్ ఎగరేసుకొని పోగా శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది.

 

షో మొదటినుంచి శ్రీముఖి రాహుల్ ని టార్గెట్ చేసిన కారణంగానే సింపతీ వర్క్ అవుట్ అయి రాహుల్ విన్నర్ అయినట్లు అందరూ అనుకుంటుండగా ఒక టాస్కులో అయితే శ్రీముఖి ఇక జన్మలో నేను రాహుల్ తో మాట్లాడను అని చెప్పేసింది. అయితే సడన్ గా రాహుల్ శ్రీముఖి లు మళ్లీ మంచి స్నేహితులు అయిపోయి ఇద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఐటెం సాంగ్స్ కి డ్యాన్స్ లు వేస్తుండటం అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, శ్రీముఖి కలిసి ఒక పార్టీ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాహుల్ మరియు శ్రీముఖి ఇద్దరు కలిసి జిగేల్ రాణి పాట కు డాన్స్ కూడా వేశారు.

 

ఇందులో భాగంగా ఓ సెల్ఫీ తీసుకున్న వీరిద్దరూ తమ మధ్య ఇప్పుడు ఇలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పారు. ఆ ఫోటోని శ్రీముఖి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'గతం గతః అసలు రిలేషన్షిప్ ఇప్పుడు మొదలైంది' అంటూ ఒక కాప్షన్ కూడా ఇచ్చింది. ఏదేమైనా మొత్తానికి ఇద్దరూ మళ్ళీ కలిశారు కాబట్టి వారి ఫ్యాన్స్ కూడా ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం ఆపేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: