సుకుమార్ తెర మీద సినిమాలని అందించే దర్శకుడు. తెర చాటున గణితం బోధించే అధ్యాపకుడు. మొదటి సినిమాతోనే సుకుమార్ పేరు మారుమ్రోగి పోయింది. మొదట దర్శకుడు సుకుమార్ 2004 వ సంవత్సరంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య సినిమా తీసాడు. ఆ సినిమానే విజయం అందుకుంది. ఆ సినిమానే అల్లు అర్జున్ ని స్టార్ చేసింది. అయితే మొదట సినిమాతోనే కెవ్వు కేక పెట్టించాడు దర్శకుడు సుకుమార్ .

 

IHG

 

అయితే ఎందులోనైనా గెలుపోటములు సహజం. రామ్ పోతినేని తో జగడం సినిమా అందించాడు. అయితే చక్కటి టేకింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆ తర్వాత మూడవ సినిమా ఆర్య 2 తీసాడు. అలానే 100% లవ్ సినిమా యువతని బాగా ఆకట్టుకుంది. విజయం అందుకుంది ఆ చిత్రం కూడా. ఆ చిత్రం పాటలకి కూడా మంచి స్థానం దక్కింది. 

 

ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలు కూడా తీసాడు. అయితే కొన్ని సినిమాలు పెద్దగా కలిసి రాకపోయినా రంగస్థలం మాత్రం మంచి హిట్ ఇచ్చింది సుకుమార్ కి. సుకుమార్ ని దగ్గర వాళ్ళు సుక్కు అని సంభోదిస్తారు. సుకుమార్ కళాశాల రోజుల్లో ఉండేటప్పుడు బాగా పుస్తకాలని చదివేవాడట. అలానే చిన్న చిన్న కవితలు కూడా వ్రాసేవాడట. 

 

IHG

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం ఈ దర్శకుడికి మంచి పేరు తెచ్చింది. సుకుమార్ కెరీర్ లో ఈ చిత్రం ఉత్తమ విజయాన్ని అందించింది. అయితే తనకి గణితం పై పట్టు ఉండడం వల్ల కాకినాడ లో మంచి కళాశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్నాడు. కానీ సినిమాల పై ఉన్న అభిలాష సినీ రంగంపై లాగుతూనే ఉంది ఈ దర్శకుడిని. రంగస్థలం వంటి హిట్ అందుకోవాలని ఏ హీరోకి మాత్రం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: