పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆస్తకిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మణిశర్మ స్వరపరిచిన కెమెరామెన్ గంగతో రాంబాబు పాటలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. ఈ పాటలకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. కెమెరామన్ గంగతో రాంబాబు పాడిన పాటలు ఎలా ఉన్నాయో ఓ చెవి వేసి వింద్దాం..! మొదటి పాట : కెమెరామాన్ రాంబాబు.. థీమ్ సాంగ్ ఈ సినిమాలో రాంబాబు వ్యక్తిత్వం వర్ణిస్తూ సాగే ఈ పాటను హేమ చంద్ర, కారుణ్య, నరేంద్ర పాడారు. ఈ పాట పవన్ అభిమానుల కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లుగా సాగుతుంది. ఈ పాటలోని పదాలు పవన్ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రెండవ పాట : పిల్లని చూస్తే... కారుణ్య, చైత్ర ఆలపించిన ఈ పాట సరదా అయిన పదాలతో సాగుతుంది. ప్రేయసి ప్రియులు మధ్య సాగే ఈ పాట ఆలరించే విధంగా ఉంది. మూడవ పాట : జ్వరమొచ్చింది... ఈ పాట వింటే ఇది సినిమాలో ఐటెం సాంగ్ ని చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఈ పాటను శ్రవణ భార్గవి, మురళి గానం చేశారు. మాస్ కోసం ఉద్దేశించిన ఈ పాట అదే ఊపులో సాగుతుంది. నాలుగవ పాట : ఎక్స్ ట్రార్డనరీ.... హేమ చంద్ర గానం చేసిన ఈ పాట వినసొంపుగా ఉంది. చిత్రీకరణ ఇలాంటి పాటలకు బాగా హెల్ప్ అవుతుంది.  ఐదవ పాట : తలదించుకు బతుకుతావా... సందేశత్మంగా సాగే ఈ పాటను కారుణ్య, హేమ చంద్ర, శ్రీకృష్ణ, నరేంద్ర గానం చేశారు. కథలో భాగంగా వినిపించే ఈ పాటలో చాలా పదునైన పదాలను ఉపయోగించారు రచయిత. ఆరవ పాట : మెలికలు తిరుగుతుంటే ... ఈ ఆల్బమ్ లో ఉన్న ఉషారు అయిన పాటగా ఈ పాటను పేర్కొనవచ్చు. నరేంద్ర, గీతా మాధురి గానం చాలా ఉషారుగా సాగుతుంది. అకట్టుకునే ఈ పాట అభిమానులకు చాలా ఉత్సాహం ఇస్తుంది. Cameraman Ganga Tho Rambabu English Audio Review   Rebel :: Tweet Review Prabhas Rebel Review English || ప్రభాస్ "రెబెల్" సినిమా తెలుగు రివ్యూ

మరింత సమాచారం తెలుసుకోండి: