కరోనా వల్ల థియేటర్లు తెరుచుకోకపోవడంతో స్మాల్ ,మీడియం రేంజ్ సినిమాలు, ఓటిటిలను ఆశ్రయిస్తున్నాయి. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి మంచి రేటుకే ఓటిటి లకు అమ్ముకొని నిర్మాతలు సేఫ్ అవుతున్నారు. అందులో భాగంగా ఇటీవల అన్ని భాషల్లో కలిపి దాదాపు ఓ10 సినిమాలు  డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యాయి అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా  సూపర్ అనిపించుకోలేదు. కానీ తాజాగా ఓ తెలుగు సినిమా మాత్రం పాజిటివ్ రివ్యూస్ తో అందరి ద్రుష్టి తన వైపుకు తిప్పుకుంటుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే క్రిష్ణ ఆండ్ హిస్ లీల.. 

 
ఎలాంటి హడావిడిలేకుండా ఈరోజు ఈచిత్రం డైరెక్ట్ గా  నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇక ఈచిత్రానికి  పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈచిత్రం మంచి టైం పాస్ మూవీ అని  కామెడీ  తో పాటు చాలా వరకు సినిమా ఎంగేజింగ్ గా ఉందని  టాక్ వస్తుంది. అక్కడక్కడ  స్లో అవ్వడం,స్క్రీన్ ప్లే ఊహాజనితంగా ఉండడం సినిమాలో మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా  సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం తెలుగు నుండి రెండో స్ట్రెయిట్ మూవీ గా విడుదలకాగా మొదటి సినిమాగా విడుదలైన అమృతరామమ్ నిరాశపరిచింది.
 
క్రిష్ణ ఆండ్ హిస్ లీలను క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేయగా సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ ,సీరత్ కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ ,వైయాకామ్ 18 స్టూడియోస్ ఈసినిమాను నిర్మించాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేకపోవడంతో త్వరలోనే మరికొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: