బుట్టబొమ్మ అని నెత్తిన పెట్టుకున్నందుకు... దక్షిణాది ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది జిగేల్‌ రాణి. తెలుగు ఆడియన్స్‌కు తన నడుము, బొడ్డు అందాలు మాత్రమే కావాలంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

పూజా హెగ్డే.. అలియాస్‌ బుట్టబొమ్మకు... ఇలా నడుము అందాల్ని చూపమని నిన్నెవరైనా అడిగారా? బొడ్డు సొగసుల్ని ఇలా జిగేల్‌ జిగేల్‌ మంటూ... చూపెట్టాలని తెలుగు ప్రేక్షకలెప్పుడు ఆమెకు మూటల కొద్దీ లెటర్లు రాశారా? ఫ్యూజ్‌ పోయిన బోర్డులో కూడా కరెంట్‌ పుట్టించే రేంజ్‌లో.. ఎక్స్‌పోజింగ్‌ చేసింది పూజా హెగ్డెనా? లేక ఆమె డూపా?

తాజాగా తెలుగు ప్రేక్షకులపైనా, దక్షిణాది ఇండస్ట్రీపైనా ఈ నార్త్‌ ఇండియన్‌ భామ చేసిన వ్యాఖ్యలు చూస్తే... ఈ గోపికమ్మనా మనం ఇన్నాళ్లూ ఆరాధిస్తుంది అని సగటు ప్రేక్షకులు అనుకోక మానరు. దక్షిణాది ప్రేక్షకులకు.. హీరోయిన్ల బొడ్డు, నడుము అందాలు మాత్రమే కావాలంట? కాళ్లంటే పడి చచ్చిపోతారంట? అందుకే తాను ఎక్స్‌ పోజింగ్‌ చేస్తోందట పాపం పూజా హెగ్డె.

సినిమాల్లో అవకాశాల కోసం ఇలా బట్టలూడదీసుకుని ఫొటోషూట్‌ చేయమని.. పూజా హెగ్డేను ఏ తెలుగు ప్రేక్షకుడూ అడగలేదు. అయినా, ఆమె చేసింది కాబట్టి... అవన్నీ తెలుగు ఆడియన్స్‌ కోసమేనన్నమాట. హీరోయిన్ల నడుము అందాల్ని చూస్తే దక్షిణాది ఆడియన్స్ మైకంలో పడిపోతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి మరి.

తెలుగు ప్రేక్షకులు బుట్టబొమ్మగా ఊహించుకొని తెగ సంబరపడిపోతున్న పూజాహెగ్డే... మంచి గిఫ్టే ఇచ్చింది. దక్షిణాది సినీ ప్రేక్షకులపై పెద్ద అబాండమే వేసింది. అదేంటంటే.. సౌత్ సినీ ఫ్యాన్స్ ... హీరోయిన్ల బోడ్డు చూసి ఫిదా అయిపోతారట. అంతేకాదు..  హీరోయిన్ల నడుము అందాలు చూస్తే మైకంలో పడిపోతారట.  

ఇప్పుడు పూజా వ్యాఖ్యలు.. సౌత్ లో దీపావళికి ముందే టపాసులు పేల్చేశాయి. దక్షిణాది వాళ్లు హీరోయిన్ల బొడ్డు, నడుము చూడాలనుకుంటారంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపింది పూజా హేగ్డే. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: