అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగులో ఓటీటీ ను ప్రారంభించాడు. ఆహా అనే పేరుతో గతంలో ఏ ప్రాంతీయ భాష ప్రకటించినంత గా ప్రకటించారు. దీంతో ఈ ఆహా సూపర్ హిట్ అవ్వడం అల్లు అరవింద్ కి మంచి పేరు తీసుకు రావడం గ్యారంటీ అనుకున్నారు.  తెలుగు ఓ టీ టీ పితామహుడు అని అల్లు అర్జున్ అల్లు అరవింద్ నీ తెగ పొగిడేశారు.  ఈ యాప్ కోసం యాడ్స్ కూడా చేశారు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ నీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. సామ్ జామ్ షో కోసం మెగాస్టార్ చిరంజీవి తీసుకువచ్చారు. అయితే ఇవేవీ ఆహా ముందుకు వెళ్ళడానికి వర్కౌట్ కాలేదు. ఆహా ను అంతర్జాతీయ ప్రమాణంలో తీర్చిదిద్దాలనే అల్లుఅరవింద్ కోరిక ప్రాంతీయ స్థాయిలోనే ఆగిపోయింది.

తాజాగా ఆహా మీద గుర్రుగా ఉన్నారు నెటిజన్స్. అయితే దీనికి ప్రత్యేక కారణం ఉంది. తాజాగా ఓ పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఆహా బృందం.  సూపర్ హిట్ సినిమా చూపిస్త మామ అని ప్రకటించారు ఆపోస్ట్ లో.  అయితే ఇలా ప్రకటిస్తే అందులో అన్ని కొత్త సినిమాలు ఉంటాయని భావించి ఉంటారు నెటిజన్స్.  కానీ వారికి గట్టి షాక్ తగిలింది. సినిమా లిస్ట్ లో లవ్ స్టోరీ , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లక్ష్య, కుడి ఎడమైతే మాత్రమే ఉన్నాయి. మిగితావన్నీ కూడా పాత సినిమాలే.  

ఆల్రెడీ ఆహా లో వచ్చిన సినిమాల గురించి మళ్లీ చెప్పారు. వీటి గురించి చెప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పైగా వాటిని సూపర్ స్టార్ సూపర్ హిట్ అని అనడంతో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో వచ్చేవి ఇప్పుడు ఆహాలో వస్తున్నాయి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇక లవ్ స్టోరీ డైరెక్ట్ ఓటీటీ నా.. అలా ఎందుకు అంటూ సెటైర్లు వేస్తున్నారు. అలా మరోసారి ఆగ్రహానికి గురి అవుతోంది ఆహా.  అంతకుముందు అల్లు అర్జున్ ను మెగాస్టార్ అని సంబోధించడం పై మెగా అభిమానులు ఫైర్ కావడంతో కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. మరి తెలుగు ప్రేక్షకుల అభిమానం కోసం అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఇలా వారి ఆగ్రహానికి గురి అవ్వడం ఒకింత నిరాశకు గురిచేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: