
ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్తగా పరిచయం అవుతుంది ఇమ్యాన్వి ఇస్మాయిల్. కొత్త ముఖం అయినప్పటికీ ఆమెకు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, టాలెంట్ ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అవుతుందని మూవీ టీమ్ చెబుతోంది. రాహుల్ రవీంద్రన్, అనుపమ కేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించడం వలన సినిమాకి మరింత బలమైందని చెప్పొచ్చు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టెక్నికల్ వర్గం విషయానికి వస్తే – సంగీతాన్ని చంద్రశేఖర్ అందిస్తుండటం కూడా ఈ సినిమాకి మరొక ప్రధాన హైలైట్ అవుతుంది.అయితే, ఈ చిత్ర షూటింగ్ విషయంలో ఇటీవల కొన్ని రకాల వార్తలు బయటకు వచ్చి చర్చనీయాంశమయ్యాయి.
దర్శకుడు హను రాఘవపూడి ప్రవర్తన కారణంగా సెట్స్‌లో కొంతమంది నటీనటులు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన చిన్న విషయానికే కోపం తెచ్చుకొని, ఒకే సీన్‌ను పదే పదే రీటేక్ చేయిస్తూ, యాక్టర్లపై మండిపడుతున్నారని టాక్. దీని వల్ల కొందరు ఈ ప్రాజెక్ట్‌పై ఇష్టం తగ్గించుకొని, బయటకు వెళ్లిపోవాలని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ విషయాలు చివరకు ప్రభాస్ చెవిన పడటంతో, ఆయన వ్యక్తిగానే హను రాఘవపూడిని కలసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. “ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. మీలోని ప్యాషన్, డెడికేషన్ సినిమాకి ఉపయోగపడేలా మార్చుకోండి. చిన్న విషయాలకు చిరాకులు చూపిస్తే టీమ్ మొత్తం నెగిటివ్‌గా ఫీల్ అవుతుంది. డైరెక్టర్ సెట్‌లో పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే అందరూ హ్యాపీగా పనిచేస్తారు. అప్పుడు మాత్రమే మంచి అవుట్‌పుట్ వస్తుంది” అని ప్రభాస్ సూటిగా చెప్పారన్నది వార్త.
ఇదంతా బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్‌గా మారింది. కొందరు ప్రభాస్‌ను “ప్రొఫెషనల్‌గా సరిగ్గా స్పందించాడు” అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు “హను రాఘవపూడి ఈ క్రేజీ ఛాన్స్‌ను వృథా చేసుకోవద్దు” అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ 2026న విడుదల చేయాలన్నది మూవీ మేకర్స్ ప్లాన్. ఈ డేట్ ఫిక్స్ అయితే, ఆ క్రిస్మస్ సీజన్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి.