టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా “దే కాల్ హిమ్ ఓజీ”. ఇండియ‌న్ మార్కెట్‌లోనే కాకుండా ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లోనూ సెన్సేషనల్ రిసెప్షన్‌ను పొందుతోంది. రిలీజ్ అయిన వారం అంతా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. మొదటి వీకెండ్‌కే ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోనే ఈ సినిమా రు. 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. పవన్ స్టామినా ఎలాంటి స్థాయిలో ఉందో ఈ రికార్డ్స్ ఫ్రూవ్ చేశాయి.


ఇక ఇప్పుడు ఈ సినిమా చుట్టూ మరో పెద్ద చర్చ నడుస్తోంది. నైజాంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం టికెట్ రేట్లను నార్మ‌ల్ రేంజ్‌కు తీసుకువ‌చ్చేశారు. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్‌లో సంతోషం వ్య‌క్తం అవుతోంది. అధిక టికెట్ రేట్ల కారణంగా కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూడటానికి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. ఇప్పుడు టిక్కెట్ రేట్లు భారీగా త‌గ్గిపోవ‌డంతో ఫుట్ ఫాల్స్ పెరుగుతాయ‌ని... ఓజీ క‌లెక్ష‌న్ల‌కు ఇది పెద్ద బూస్ట్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.


అయితే ఈ టిక్కెట్ రేట్ల త‌గ్గింపు ప్ర‌భావం ఎలా ఉందో తెలియాలంటే మంగళవారం వ‌సూళ్లు పెరిగితే, ఇది మేకర్స్‌కి ఒక బిగ్ లెసన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్స్‌కి వచ్చే అవకాశముంది. ఇది సినిమా లాంగ్ రన్‌కి చాలా ప్లస్ అవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: