టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ది రాజా సాబ్’ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ప్రభాస్ కెరీర్‌లో ఇది ఒక వినూత్నమైన ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ట్రైలర్‌లో ప్రభాస్ స్టైల్, మారుతి తీసిన మాస్, ఫ్యామిలీ ప్యాకేజీ టచ్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంది.


ఈ సారి సంక్రాంతి సీజన్‌లో ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాకు గ‌ట్టిపోటీ త‌ప్పేలా లేదు. రాజాసాబ్ రిలీజ్ రోజునే  కోలీవుడ్ సూపర్ స్టార్ ద‌ళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ తమిళంలో విడుదల కానుంది. దీంతో తమిళనాడులో రెండు స్టార్ హీరోల సినిమాలు పోటీప‌డితే బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ క్రమంలో రాజా సాబ్ మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ్ మార్కెట్‌లో ఒకే రోజు క్లాస్ లేకుండా ఉండేందుకు త‌మిళ్ రాజాసాబ్ వెర్ష‌న్‌ను ఒక రోజు ఆల‌స్యంగా అంటే జ‌న‌వ‌రి 10న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.


విజ‌య్ చివ‌రి సినిమాను గౌర‌విస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మేక‌ర్స్ చెపుతున్నారు. రాజాసాబ్ మేక‌ర్స్‌ నిర్ణయాన్ని తమిళ్ ఆడియన్స్‌తో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా అభినందిస్తున్నాయి. ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు కొత్త అనుభూతినిస్తుంద‌ని అంటున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: