పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే, పవర్ స్టార్ అంటేనే చాలు పవన్ కళ్యాణ్ అని టక్కున చెప్పేస్తారు. అంతలా ఆయన పేరు దేశవ్యాప్తంగా పాకింది. అంతేకాదు ఇతర దేశాలలో కూడా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ ఒకసారి పాండీ బజార్ లో ఒక హోటల్ లో టీ తాగుతూ.. టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ పై చూశాడు. ఇది చూసిన వెంటనే తను రాసుకున్న కథకు బాగా సెట్ అవుతాడు అనుకొని, వెంటనే హైదరాబాద్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కరుణాకరన్  చెప్పిన ప్రేమకథ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఈ సినిమాలో చెల్లెలి పాత్ర అత్యంత ప్రాధాన్యం. ఇక అప్పటికే  తమిళ సీరియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న  తమిళ సీరియల్ నటి వాసుకి గుర్తొచ్చింది ఆయనకు. కాకపోతే వాసుకి అంతకుముందే సినిమాలలోకి అడుగు పెట్టనని తనకు తానే వాగ్దానం కూడా చేసుకుందట. ఆమెకు అప్పటికే వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇక చివరిగా కరుణాకరన్ కూడా కథ చెప్తున్నప్పుడు.." నేను ఈ సినిమాలో నటించానని ఖచ్చితంగా చెప్పేయాలి" అని అనుకుందట. కరుణాకరన్ గత ఏడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి రాసుకున్న కథను వినగానే, వాసుకి మనసు కరిగి పోయి, వెంటనే ఒప్పేసుకుందట.
కట్ చేస్తే.. ఈ సినిమా తీయడానికి రెడీ అయిపోయింది వాసుకి. ఇంతకు ఎవరితో నేను సినిమా తీయాలని అడిగిందట. అప్పుడు టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ఆయన. ఇకపోతే కరుణాకరణ్ వాసుకి కథ చెప్పే రోజుకి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా వాసుకి తెలియదట.. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. అలా  తొలిప్రేమ చిత్రం 1998వ సంవత్సరంలో విడుదలైన ఘన విజయం సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో వాసుకీ నటించి ఆమెకు కూడా మంచి స్టార్ పొజిషన్  వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: