సంక్రాంతి అంటే వెలుగులు జిమ్మే వేడుక. తెలుగు వారికి కొత్త కాంతులను తెచ్చే అతి పెద్ద పండుగ. సంక్రాంతి అంటే అందరికీ ఇష్టమే. సెలవులే సెలవులు. ఇక ఎక్కడ ఉన్న వారు అయినా సొంతూళ్ళకు క్యూ కడతారు. దాంతో వినోదాలకు రెక్కలు వస్తాయి.

సంక్రాంతికి టాలీవుడ్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. పండుగ కోసం పందెం కోళ్ళ మాదిరిగా సినిమాలను రిలీజ్ చేస్తుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ దాదాపుగా లాభాలను చూసినా రారాజు లాంటి మూవీ ఒకటి ఉంటుంది. అదే సంక్రాంతి విజేత కిరీటం సొంతం చేసుకుంటుంది.

ఈసారి అలాంటి పందెం కోడి ఏదీ అన్న చర్చ అపుడే మొదలైంది. సంక్రాంతికి ఈసారి వారం ముందు అంటే జనవరి 7న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అవుతోంది. అంటే ఈసారి సంక్రాంతి సంబరాలు చాలా ముందుగానే  వచ్చేసినట్లు అన్న మాట. ట్రిపుల్ ఆర్ సందడి అలా ఉండగానే జనవరి 12న  పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ థియేటర్లలోకి వస్తుంది. ఇది పక్కా మాస్ మూవీ. ఇక 14న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. దీంతో ఈసారి సంక్రాంతి ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు అంటున్నారు.

ఈ మూడు సినిమాల్లో చూసుకుంటే వేటికవే సరి సాటి గా ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ రేంజి వేరు, రాధేశ్యామ్ స్థాయి వేరు, ఇక పవన్ మూవీ పక్కా లోకల్ అయినా పవర్ స్టార్ ఇమేజ్ వేరు. సో మూడింటికి మూడూ పందేం కోళ్ళే. దాంతో సంక్రాంతి విజేత ఎవరూ అని చెప్పడం కష్టమే. అన్ని సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే అన్నీ సూపర్ కలెక్షన్లు కొల్లగొట్టి అసలైన సంక్రాంతికి చిత్ర సీమకు తేవాలని గట్టిగా కోరుకుంటున్నారు. తెలుగు పరిశ్రమ కాంతులను ఇచ్చే ఇయర్ గా 2022 ఉండాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: