మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంత ముఖ్యమో డాన్స్ కూడా అంతే ముఖ్యం, మెగాస్టార్ చిరంజీవి ఆ కాలంలో ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకున్నది డాన్స్ తోనే, ఆ కాలంలో చిరంజీవి ఇండియాలోనే నెంబర్ వన్ డాన్సర్ అనేది దాదాపు వాస్తవం.  ఆ కాలంలో చిరంజీవి అదిరిపోయే డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. అయితే అలా టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో రత్తాలు రత్తాలు అనే మొదటి పాటలోనే చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.

ఈ సినిమాలో ఈ ఒక్క పాట మాత్రమే కాకుండా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు,  సుందరి సుందరి  అనే పాటలకు కూడా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్ లు వేసి కుర్ర హీరోలకు నేనేమీ తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు. అయితే ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో మాత్రం చిరంజీవి పెద్దగా డాన్స్ మూమెంట్స్ వేయలేదు. దానికి ప్రధాన కారణం ఆ సినిమా స్టోరీ ప్రకారం ఎక్కడ కూడా డాన్స్ చేయవలసిన అవసరం రాలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో లహే లహే  సాంగ్ లో అదిరిపోయే స్టెప్ లు వేసి ప్రేక్షకులను అలరించిన చిరంజీవి. తాజాగా విడుదలైన సనా కష్టం వచ్చిందే సాంగ్ లోను అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ వేసాడు. విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ లో చిరంజీవి తన డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టాడు. ఈ వయస్సు లో కూడా ఈ రేంజ్ లో డాన్స్  చేయడం అనేది మామూలు విషయం కాదు, అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుత తో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: