అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కింగ్ నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్‌ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సూపర్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిందీ ముద్దు గుమ్మ‌. ఆ త‌ర్వాత అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `విక్రమార్కుడు` సినిమాతోనే అనుష్క తొలి హిట్ అందుకుంది. అలాగే 2009లో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క కెరీర్‌ను ఒక్క సారిగా మలుపు తిప్పింది.

అనుష్క చేసిన ఈ లేడీ ఓరియెంటెండ్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఈ మూవీ త‌ర్వాత లేడీ ఓరిమెంటెండ్ చిత్రాలంటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది అనుష్క పేరే. అంత‌లా ఆమె అరుంధతితో ఆక‌ట్టుకుంది. అలాగే బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క‌.. చివ‌రిగా `నిశ్శబ్దం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ఇక పోతే అనుష్క కెరీర్‌లో దాదాపు అన్నీ హిట్ చిత్రాలే ఉన్నాయి. కానీ, ఓ చిత్రం మాత్రం భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అయింది. ఆ చిత్ర‌మేదో కాదు `రుద్రమదేవి`. గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌గా.. రానా ద‌గ్గుబాటి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నిత్య మీనన్, కేథరీన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజు, సుమన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

గుణ టీమ్ వర్క్స్ బ్యాన‌ర్‌పై దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో గుణశేఖర్ స్వ‌యంగా నిర్మించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఓపెనింగ్స్ బాగానే రాబట్టినా.. క‌థ‌నం స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ త‌ర్వ‌త పూర్తిగా డ‌ల్ అయిపోయి గుణ‌శేఖ‌ర్‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: