లతా మంగేష్కర్.. ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మొన్నటి వరకు ఆరోగ్యం సరిగా లేదని హాస్పిటల్ చుట్టూ తిరిగి.. అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశారు. అయితే మళ్లీ ఆరోగ్యం కుదుట పడడంతో అభిమానులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.. కానీ మళ్ళీ నిన్న ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో చేరడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తాజాగా స్వర్గస్తులయ్యారు.. లతా మంగేష్కర్ లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది.. ఎస్పీ బాలసుబ్రమణ్యం సినీ ఇండస్ట్రీని వెళ్లడంతో గొప్ప గాయకుడు లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అని ఎంతోమంది ఆ బాధ నుంచి తేరుకోకముందే మరొక ప్రముఖ నేపథ్య గాయకురాలు మరణించడంతో పూర్తిగా మూగపోయింది సినీ ఇండస్ట్రీ..


సెప్టెంబర్ 28 1929వ సంవత్సరంలో హేమా మంగేష్కర్ గా జన్మించిన ఈమె సంగీత స్వరకర్త గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఏడు దశాబ్దాల పాటు సినీ కెరీర్లో భారతీయ సంగీత పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్  మెలోడీ వంటి అరుదైన గౌరవ బిరుదులు కూడా లభించడం జరిగింది. లతా మంగేష్కర్ ఏకంగా 36 భారతీయ భాషలలో అలాగే కొన్ని విదేశీ భాషల్లో కూడా పాటలను రికార్డు చేసి ఒక సంచలనం సృష్టించారు.  ఎక్కువగా హిందీ అలాగే మరాఠి భాషలలో పాటలను స్వరపరిచే వారు. అంతేకాదు 1989వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో ఘనంగా సత్కరించింది..


అంతేకాదు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న అవార్డును ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. భారతదేశంలో మాత్రమే కాకుండా ఫ్రాన్స్ లో కూడా 2007లో ఫ్రెండ్స్ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఆఫీసర్ ఆఫ్ ద లెజియన్  ఆఫ్ హానర్ అని పురస్కారాన్ని అందించారు.. ఇక పోతే ఎన్నో నేషనల్ అవార్డ్స్ తోపాటు ఫిలింఫేర్ అవార్డ్స్ అలాగే నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఈమె ఇలా స్వర్గస్తులు కావడం సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: