ఒకప్పుడు ఎస్ వి రంగారావు.. ఆ తర్వాత రావు గోపాల్ రావు.. ఇక ఇప్పుడు రావు రమేష్.. ఇక ఫ్యూచర్లో దగ్గుపాటి రానా.. ఇక ఎస్వీ రంగారావు, రావు గోపాల్ రావు లాంటి లెజండరీ నటుల తో పోల్చి చూస్తే మాత్రం రానా నటన ఎక్కడ తగ్గలేదు అనిపిస్తుంది. ప్రతి సినిమాలో రానా నట విశ్వరూపం చూస్తుంటే.. ఇతనికి సవాల్ విసిరే పాత్రే లేదా అని ప్రేక్షకులకే కాదు సినీ విశ్లేషకులు సైతం అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఏం నటన.. రానా చేసే ప్రతి పాత్ర ఇక అతని కోసమే పుట్టిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది పాత్రల గొప్పతనం కాదు రానా నటన గొప్పతనం.


 ఇలా ఇప్పటివరకు రానా చేసిన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. లీడర్ సినిమాతో రానా హీరోగా ఎంట్రీ వచ్చినప్పుడు.. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అవుతాడు లే హీరో అవుతాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు రానా నటన చూసిన తర్వాత.. హీరో విలన్ కాదు రానా ఒక గొప్ప నటుడు అవుతాడు.. తెలుగు చిత్ర పరిశ్రమ పేరు నిలబెడతాడు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. బాహుబలి లో బళ్ళాల దేవుడిగా.. ఎన్టీఆర్ కథానాయకుడిలో చంద్రబాబు నాయుడు గా.. ఇక ఇప్పుడు భీమానాయక్ లో డానియల్ శేఖరుడి గా అబ్బో పాత్రకు ప్రాణం పోయడం కేవలం రానాకి మాత్రమే సొంతం అయింది.



 ఇక భీమ్లా నాయక్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అయితే రానా నటన పిక్స్ లెవల్లో ఉంది.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండి.. మాజీ ఆర్మీ ఆఫీసర్ గా ఉండే డానియల్ శేఖర్ అహంకారంతో ఊగిపోతూ ఉంటాడు.. ఇక అలాంటి పాత్రలో రానా  నటించి పాత్రకి ప్రాణం పోశాడు.. ఇక డానియల్ శేఖర్ పాత్రలో రానా తప్ప ఇంకెవరు చేసినా ఆ పాత్ర అంత హైలెట్ అయ్యేది కాదేమో.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ నటన ముందు డానియల్ శేఖర్  పాత్ర డీలా పడిపోయేది. రానా లాంటి నటుడు ఆ పాత్ర చేయడంతో డానియల్ శేఖర్ పాత్ర భీమ్లా నాయక్ సరి దీటుగా  ఉంది. కొన్ని సన్నివేశాల్లో అయితే పవన్ నటన ను మించిపోయింది రానా యాక్టింగ్ .. ఇక రానా పవర్ఫుల్ నటన చూసిన తర్వాత తప్పకుండా దర్శకులందరూ మరో మల్టీస్టారర్ లో రానాకు అవకాశం ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: