ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ డివోర్స్‌ పోస్ట్‌ పెట్టినప్పడు చాలామంది షాక్‌ అయ్యారు. ఎందుకు విడిపోయారు అని చర్చలు మొదలయ్యాయి. ఇక ఇటీవల ఐశ్వర్య డైరెక్ట్‌ చేసిన 'సంచారి' సాంగ్‌ విడుదల అయింది. ఈ సాంగ్‌ బాగుందని ఐశ్వర్యకి ధనుష్‌ కృతజ్ఞతలు చెప్పాడు. దీంతో డివోర్స్‌ షాక్‌ కాస్త ఆశ్చర్యంగా మారింది. ఇక ధనుష్‌ కామెంట్‌కి ఐశ్వర్య థ్యాంక్స్‌ అని చెప్పాక ఆ ఆశ్చర్యం మళ్లీ షాక్‌గా మారింది. ఇంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు ఎందుకు విడిపోయారని ఆరాలు తీయడం ఎక్కువైంది.

నాగచైతన్య, సమంత ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి వందకి నూట పది మార్కులు పడుతుంటాయి. అయితే సినిమాల్లో సూపర్ హిట్‌ జోడీ అనిపించుకున్న చైసామ్ మేరీడ్‌ లైఫ్‌ని ఎక్కువకాలం కలిసి కొనసాగించలేకపోయారు. ఇద్దరమూ మ్యూచువల్‌గా విడిపోతున్నామని చెప్పి అభిమానులని షాక్‌లో పడేశారు. ఆ తర్వాత 'బంగార్రాజు' విడుదల సమయంలో ఇద్దరమూ హ్యాపీగా ఉండటానికే విడిపోయామని చెప్పి అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. దీంతో వీళ్లిద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశముందనే ప్రచారం మొదలైంది.

ఆమిర్ ఖాన్, కిరణ్ రావు డివోర్స్‌ వార్త విన్నప్పటి నుంచి బాలీవుడ్‌ జనాలంతా షాక్ అవుతున్నారు. ఈ స్టార్ కపుల్ విడిపోవడానికి కారణమేంటని డిస్కషన్లు పెడుతున్నారు. అయితే ఈ కపుల్ మాత్రం డివోర్స్‌ కూడా మన మంచికే అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అందంగా, అద్భుతంగా సాగిన 15 ఏళ్ల వివాహబంధం నుంచి దూరమవుతున్నా, ఫ్రెండ్స్‌లాగే ఉంటామని, కొడుకు ఆజాద్‌ని కలిసి చూసుకుంటామని స్టేట్ మెంట్ ఇచ్చారు.

హృతిక్ రోషన్, సుశానే ఖాన్ విడిపోయినప్పుడు సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ కనిపించాయి. హృతిక్‌ ఎఫెర్స్‌ వల్లే ఇద్దరూ విడిపోయారని, సుశానేకి హృతిక్‌ భరణంగా 400 కోట్లు ఇచ్చాడనే ప్రచారం జరిగింది. అయితే బయట ఇంత ఇష్యూ జరిగింది గానీ ఈ కపుల్‌ మాత్రం మ్యూచువల్‌గా విడిపోయారు. ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. కరోనా ఫస్ట్ లాక్‌డౌన్‌లో పిల్లల్ని చూసుకోవడానికి హృతిక్ ఇంటికి వెళ్లింది సుశానే. అలాగే ఇద్దరూ కలిసే పిల్లల బర్త్‌డే పార్టీస్‌ చేస్తున్నారు. మలైక అరోరా ఖాన్, అర్భాజ్ ఖాన్ విడిపోయి చాలా రోజులు అయ్యింది. ఇక మలైక, అర్జున్‌ కపూర్‌ని పెళ్లి చేసుకుంటుందనే మాటలు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక అర్భాజ్ ఇటలీ మోడల్ జార్జియా ఆండ్రియానితో రిలేషన్‌లో ఉన్నాడనే టాక్ కూడా ఉంది. అయితే వీళ్ల రిలేషన్స్ ఎలా ఉన్నా, మలైక, అర్భాజ్ ఇద్దరూ కొడుకు అర్హాన్ ఖాన్‌ కోసం కలుస్తూనే ఉంటారు. పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తుంటారు.

అమృత సింగ్‌ని పెళ్లి చేసుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ చాలా పోరాటాలు చేశాడు. తనకంటే 13 ఏళ్లు పెద్దదైన అమృతని పెళ్లికి ఒప్పించడానికి దీక్షలు లాంటివి చేశాడు సైఫ్. అయితే ఇంత పోరాడి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు 13 ఏళ్ల తర్వాత విడిపోయారు. అయితే డివోర్స్‌ తీసుకున్నా పిల్లలు సారా అలీఖాన్‌, ఇబ్రహీం అలీఖాన్‌ని కలిసే పెంచారు. ఇద్దరూ పిల్లల కెరీర్‌కి గైడెన్స్‌ ఇస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: