బాలీవుడ్ ఐటమ్ గార్ల్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడి మాజీ భార్య హాట్ బ్యూటీ మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఇక యాక్సిడెంట్ కావడంతో ఆమెకి గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేసి ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఇక పూణే సిటీలో ఓ ఫ్యాషన్ ఈవెంట్ హాజరవ్వడానికి కారులో పయనమైంది మలైకా ఆరోరా. ముంబై నగరశివార్లలో ఆమె ఈ కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో మలైకా అరోరా కి చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం మలైకా అరోరా  పరిస్థితి బాగానే ఉందని.. మలైకా సోదరి అమ్రితా ఓ మీడియా పోర్టల్ కి వివరాలు వెల్లడించింది.ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వేలో ఈ యాక్సిడెంట్ జరిగిందని ఖోపోలి పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇక మూడు కార్లు ఒకదానిపై మరొకటి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం తెలుస్తోంది. 


ఆ మూడు కార్లకు డ్యామేజ్ అయిందని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామని.. విచారణ కూడా ఇక మొదలుపెడతామని తెలిపారు పోలీసులు.ఇక మలైకా అరోరా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె చేతుల్లో సినిమా అవకాశాలు లేవు కానీ కొన్ని టీవీ షోలకు మాత్రం మలైకా అరోరా జడ్జిగా వ్యవహరిస్తోంది. అలానే మలైకా అరోరా కంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో గత కొంత కాలం నుంచి పీకల్లోతూ ప్రేమలో ఉండి అతనితో డేటింగ్ చేస్తుంది. వీరి ఇద్దరి మధ్య కూడా పన్నెండేళ్ల తేడా ఉంది. అయినా కాని అసలు అవేమీ పట్టించుకోకుండా ఈ జంట తమ లవ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. కానీ వీరి ప్రేమపై బాలీవుడ్ లో తరచూ ట్రోల్స్ వస్తుంటాయి.అయినా కాని వీటిని చాలా లైట్ తీసుకొని ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: