టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఎప్పటికప్పుడు వెరైటీ సబ్జెక్ట్స్ ఇంకా అలాగే ఎన్నో డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు..అయినా కానీ నాగశౌర్య అంచనాలు అనేవి పాపం ఎప్పుడూ కూడా తలకిందులవుతున్నాయి. వరుసగా ఫ్లాప్ లతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు పెద్ద సక్సెస్ నాగశౌర్యను బాగా ఊరిస్తోంది.ఇక ఆ వివరాలిప్పుడు చూద్దాం.ఇక వరుసగా అనేక రకాల ఫెయిల్యూర్స్ పలకరించినా కానీ నాగశౌర్య సినిమాలు చెయ్యడం మాత్రం అస్సలు ఆపడం లేదు. సంవత్సరానికి ఖచ్చితంగా ఒకటి రెండు సినిమాలు కంపల్సరీగా రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 10 2021న అర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ కు లక్ష్య సినిమాని అందించాడు. ఆ వెంటనే జనవరి 7, 2022న రీతూవర్మతో జతకట్టి వరుడు కావలెను సినిమాను స్ర్టీమింగ్ కి రిలీజ్ చేసి వదిలాడు. లేటెస్ట్ గా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ డైరెక్షన్ లో నాగశౌర్య చేసిన మూవీ కృష్ణ వ్రింద విహారి. ఈనెల 20 వ తేదీన థియేటర్లోకి రానుంది.



కృష్ణ వ్రింద విహారి.. అరే సినిమా టైటిలే చాలా కొత్తగా ఉందంటే, ఈ సినిమాలో నాగశౌర్య లుక్ కూడా చాలా ప్లజెంట్ గా ఉంది. ఇందులో నాగశౌర్యకు జోడీగా షిర్లే షెటియా నటిస్తోంది. ఇద్దరి జోడీ కూడా చాలా బాగా కుదిరింది. ఫామిలీ ఆడియన్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకునేలా రెడీ అయిన ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హాండ్సమ్ హీరో. ఇప్పటికే విడుదల అయిన అయిన టీజర్ ఇంకా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.ఇక ఇప్పుడు కృష్ణ వ్రింద విహారితో కలిపి నాగశౌర్య మొత్తం రెండు సినిమాలు చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న పలానా అబ్బాయి  పలానా అమ్మాయి సినిమా అయితే ప్రస్తుతం మేకింగ్ దశలో ఉంది. ఊహలు గుస గుసలాడే సినిమా తర్వాత వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలనేవి వున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాతో మంచి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగశౌర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: