బాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన రన్బీర్ కపూర్ తాజాగా బ్రహ్మస్త్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయాన్ని మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో ఆలియా భట్ , అమితా బచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయి ముఖ్య పాత్రలో కనిపించనుండగా ,  అయాన్ ముఖర్జీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో బ్రహ్మాస్త్ర : శివ మొదటి భాగం. ఈ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా సెప్టెంబర్ 9 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా మూవీ యూనిట్ అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ మూవీ కోసం భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా తెలుగులో చిత్ర బృందం నిర్వహించడానికి ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఫ్రీ రిలీజ్ వేడుక ను మూవీ యూనిట్ నిర్వహించ లేక పోయింది. కాకపోతే అతి తక్కువ మంది సభ్యులతో ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా ఈ మూవీ యూనిట్ చిన్న ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు ప్రమోషన్ లలో భాగంగా ఈ చిత్ర బృందం ఈటీవీలో ప్రసారం అవుతున్న క్యాష్ ప్రోగ్రామ్ కి విచ్చేశారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన షూటింగ్ ని బ్రహ్మాస్త్ర మూవీ యూనిట్ తాజాగా ముగించింది. ఈ షో లో రన్బీర్ కపూర్ , ఆలియా భట్ , మౌని రాయ్ ,  రాజమౌళి పాల్గొన్నారు. ఈ షో సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: