ఒకప్పుడు విలన్ గా ఏకచ్ఛత్రాధిపత్యానికి కొనసాగించిన రఘువరన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు రఘువరన్. ఈ క్రమంలోనే తనదైన విలనిజం తో అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడం మలయాళ భాషల్లో కూడా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు ఈయన.


 తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన శివ పసివాడి ప్రాణం లాంటి సినిమాలో విలన్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాలో కూడా మెయిన్ విలన్గా నటించి అదరగొట్టాడు అని చెప్పాలి. అంతేకాదండోయ్ అంజలి వంటి క్లాస్ సినిమాలో తండ్రి గా కూడా నటించి తన నటనతో మెప్పించాడు అని చెప్పాలి. విలన్ గా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన నటనకు తిరుగులేదు అని నిరూపించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.


 అయితే మందుకు బానిసైన రఘువరుణ్ లివర్ దెబ్బతినడంతో ఇతర అవయవాల మీద కూడా ఎఫెక్ట్ పడింది.  దీంతో చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయారు. రఘువరన్ భార్య పేరు రోహిణి. రిషి వరుణ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే రఘువరన్ విల్లన్ మాత్రమే కాదు గాయకుడు కూడా అంటూ ఆమె భార్య కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాడిన పాటను విడుదల చేశారు ఆమె. అంతే కాదు మా అబ్బాయి ఈ విడుదల కార్యక్రమం కోసం మొదటి సారి మీడియా ముందుకు వచ్చాడు అంటూ తెలిపింది. ప్రస్తుతం రఘువరన్ కొడుకు అమెరికాలో చదువుతున్నట్లు రోహిణి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: