వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు ఇప్పటికే మెంటల్ మదిలో , నీది నాది ఒకే కథ ,  బ్రోచేవారెవరురా ,  రాజ రాజ చోరా వంటి విజయవంతమైన మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు ఆఖరుగా అర్జున పాల్గుణ ,  భళా తందానాన మూవీ లతో వరస అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇలా వరుస పరాజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న శ్రీ విష్ణు తాజాగా అల్లూరి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. అల్లూరి మూవీ నిజాయితీ కి మరో పేరు అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కింది. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... అల్లూరి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. అల్లూరి మూవీ తో శ్రీ విష్ణు ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: