టాలీవుడ్ స్టైలిష్ స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి పేరు ఉంది. ఆయన సినిమాలో ప్రతీది చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉండేలా చూసుకుంటాడు. ఇక ఏ హీరోని అయినా ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపిస్తాడు. ఇక సాంగ్స్ అయితే చెప్పనవసరం లేదు. త్రివిక్రమ్ ప్రతి మూవీస్ లో సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్ హిట్ అవుతాయి. ఇక ఆయనతో టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నమ్రతా శిరోద్కర్ ఇంతకుముందే మహేష్ కొత్త లుక్ ఫోటోను షేర్ చేసారు.అయితే అభిమానులు మహేష్ కొత్త రూపాన్ని చూసి ఫుల్ ఫిదా అవుతూ హాలీవుడ్ అందాల నటుడు నటుడు కీను రీవ్స్ తో పోల్చడం ప్రారంభించారు.ఈ లుక్ లో మహేష్ జాన్ విక్ తరహా యాక్షన్ సినిమా చేయడం ఎగ్జైటింగ్ గా ఉంటుందని కొందరు అన్నారు.ప్రస్తుతానికి SSMB28 గా పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది అంటూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంతకుముందే ప్రకటించింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ తో మహేష్ తిరిగి పని చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో మహేష్ బాబు కొత్త రూపాన్ని ఆవిష్కరించిన తర్వాత స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.


మహేష్ లుక్ ని హాలీవుడ్ నటుడు కీను రీవ్స్ తో పోలుస్తూ వందలాది పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక అభిమాని ఇలా రాసాడు. ఈ లుక్ తో జాన్ విక్ తరహా యాక్షన్ సినిమా పడ్తే సూపర్ ఉంటుంది అని అన్నారు. మరో అభిమాని కీను రీవ్స్ తో కలిసి మహేష్ ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు. ఆగస్టులోనూ నమ్రత అదే లుక్ లో మహేష్ ఫోటోని షేర్ చేయగా.. అభిమానులు జాన్ విక్ ఆఫ్ ఇండియా అంటూ అభివర్ణించారు. కొందరు మహేష్ ని జాన్ విక్ గా ఆవిష్కరిస్తూ పోస్టర్లు కూడా వేశారు.సర్కారు వారి పాటలో మహేష్ స్టైలిష్ వడ్డీ వ్యాపారిగా గా కనిపించి అదరగొట్టాడు.కానీ ఆ సినిమాకు భిన్నమైన కథాంశాలను ఎంచుకుని ఇప్పుడు మహేష్ లుక్ పరంగానూ ప్రయోగాలు చేస్తుండడం ఆసక్తికరం. త్రివిక్రమ్ తో తన తాజా ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన తర్వాత మహేష్ తన కెరీర్ తొలి భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం కోసం ఎస్.ఎస్ రాజమౌళితో కలిసి ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు. ఏది ఏమైనా త్రివిక్రమ్, రాజమౌళి టాప్ డైరెక్టర్లు కావడంతో ఈ రెండు సినిమాల పై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: