ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన సినిమా పుష్ప..ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది..పుష్పరాజ్‌ మేనరిజానికి ఫిదా అయ్యారు. ముఖ్యంగా బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సుకుమార్‌ మార్క్‌ దర్శకత్వం, బన్నీ నటనకు దేశమంతా ఉర్రూతలూగింది. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఈ లోని డైలాగ్‌లు ఓ రేంజ్‌లో క్లిక్‌ అయ్యాయి.


ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప ది రూల్‌ పేరుతో సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పుష్ప తొలి పార్ట్‌ విడుదలై ఇప్పటికే దాదాపు ఏడాది దగ్గరపడుతోన్న నేపథ్యంలో సీక్వెల్‌ కోసం ప్రేక్షకులకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడూ పుష్ప2 వస్తుందా అని కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ఫ్యాన్స్‌ కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే నిజానికి ఇప్పటికే ఈ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి అల్లు అర్జున్‌ మరో కు సైన్‌ చేయకపోయినప్పటికీ, సుకుమార్‌ కొత్త ప్రాజెక్ట్‌ మొదలు పెట్టక పోయినప్పటికీ పుష్ప2 చిత్రీకరణ వాయిదా పడుతోంది.


అయితే అభిమానుల ఎదురుచూపులకు త్వరలోనే ఫుల్ స్టాప్‌ పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న పుష్ప సీక్వెల్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది టాక్‌. ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం సుకుమార్‌ ఏకంగా హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ను తీసుకురానున్నారని సమాచారం..


మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తొలిపార్ట్‌లో ఐటెం సాంగ్‌ సమంత ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్‌లో స్పెషల్‌ సాంగ్‌కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకోనున్నారని వచ్చాయి..మరి సినిమా విడుదల అయ్యేవరకు ఏమౌతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: