ఇక ఆలియా బిడ్డతో ఇంటికి వచ్చిందని తెలియడంతో... చిన్నారిని చూసేందుకు పలువురు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. తమ క్యూట్ బేబీని చూడలంటే మాత్రం ఓ కండీషన్ పెట్టింది జంట,అయితే పాపను చూడాలంటే వచ్చిన వారికి తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని ఈ జంట కండీషన్ పెట్టిందని తెలుస్తోంది.ఇక దీంతో కొందరుబంధు మిత్రులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇంత నిబంధనలు ఎందుకంటే కాస్త అసహనం వ్యక్తంచేస్తున్నారు.ఇదిలావుండగా మరోవైపు ఆలియా విషయానికి వస్తే..
ఈ భామ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ... సందడి చేసింది.ఇక బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ బంప్‌తో కనిపించింది ఆలియా. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది.ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఓ హిట్ అందించింది.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో కనిపించారు.కాగా సీత పాత్రలో ఆమె నటనతో అందర్నీ మెప్పించారు.అయితే ఆలియా నటించిన గంగూభాయి కతియవాడి సినిమా కూడా విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన విషయం తెలిసిందే..!!