తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన వారు ఎంతో మంది ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇంట్రెస్ట్ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో ఒకరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దు గుమ్మ హ్యాపీ డేస్ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా తమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న భోళా శంకర్ అనే మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది వరకే అనేక సార్లు మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా తమన్నా పెళ్లికి ఓకే చెప్పినట్లు , దానితో తమన్నా కు ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపార వ్యక్తి కి పెళ్లి కుదిరినట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా గుర్తుందా సీతాకాలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సత్యదేవ్ హీరోగా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: