మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6  ఫినాలే కి  ఇంకా మూడు రోజుల సమయం ఉంది. డిసెంబర్ 18 ఆదివారం విజేత ఎవరు అన్నది తెలిసిపోతుంది .ఇక ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో నాగార్జున లేదా గెస్ట్ విన్నర్ ఎవరు అన్నది చెప్తారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ హౌస్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, శ్రీహాన్ ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి వెళ్లిపోయారు. అయితే బుధవారం వరకు వచ్చిన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇక ఈ విషయం హౌస్ మేట్స్ కి కూడా తెలియదు. శ్రీ సత్య, కీర్తి, రెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక ఫైనల్ కి చేరిన ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా నిలుస్తారు. ఇక విన్నర్ కి ప్రైజ్ మనీ 50 లక్షలు దాంతోపాటు సువర్ణభూమి వారి 25 లక్షల విలువైన ప్లాట్ కూడా గెలుచుకుంటారు. అయితే ప్రైజ్ మనీ బహుమతులు మొత్తం 85 లక్షల వరకు ఉంటుంది. ఇక మూడు నెలలకు పైగా కొనసాగిన ఈ షో ప్రయాణం అంత సులువైనది కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .మానసికంగా, శారీరకంగా కంటెస్టెంట్స్ యుద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికిగాను విన్నర్ కి అంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో కూడా విన్నర్ ఎవరవుతారు అనే ఆసక్తి నెలకొంది.

అయితే ఈ క్రమంలోనే చాలామంది ఆడియన్స్ ఫైనల్ కి ముందే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక సెర్చ్ చేసిన వారికి షాకింగ్ ఆన్సర్ దక్కింది. అయితే గూగుల్ చెప్తున్న దాని ప్రకారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ రోహిత్ అని తెలుస్తుంది. అయితే హు ఈస్ బిగ్ బాస్ 6 విన్నర్ అని సర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపెడుతుంది. దీంతో ఈ సీజన్ విన్నర్ రోహిత్ అని అందరూ అంటున్నారు. ఈ సీజన్ విన్నర్ ఎవరు అని తెలియాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: