ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోలు నటించిన సినిమాల కోసం ... స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాల కోసం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలతో ఎదురుచూసేవారు. 

అలాగే అందులో ఎక్కువ శాతం సినిమాలు ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించాయి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం కూడా భారీ అంచనాల నడుమ కొన్ని బాలీవుడ్ సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం థియేటర్ లలో విడుదల ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయిన బాలీవుడ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

హీరోపంతి 2 : టైగర్ ష్రఫ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .
జయేష్ బాయ్ జోర్డాన్ : రన్వీర్ సింగ్ హీరోగా తరికెక్కిన ఈ మూవీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించలేక పోయింది.
రక్షా బంధన్ : అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది.
షంషేరా : రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డ మూవీ కూడా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది.
అక్షయ్ కుమార్ హీరోగా బచ్చన్ పాండే మూవీ కూడా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది.
కంగనా ప్రధాన పాత్రలో తేరక్కెక్కిన ధాకడ్ మూవీ కూడా ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది.
అమితాబ్ బచ్చన్ , అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రన్ వే 34 మూవీ కూడా ప్రేక్షకులకు నిరుత్సాహపరిచింది.
బాలీవుడ్ మూవీలు ఈ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: