పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' అనధికారిక టైటి ల్ తో ఓ సినిమా తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా పట్ల ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవాని కి ఈ సినిమా తెరకెక్కడం రూమర్స్ అనుకున్నారు అందరు.. కానీ చడిచప్పుడు లేకుండా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి మారుతి డార్లింగ్ అభిమాను లందరికీ షాక్ ఇచ్చారు. ఏదేమైనా ఆ ది పురుష పోస్ట్ పోనే అవడం ఈ సినిమా మొదలవడం అందరిని ఎంతో ఆసక్తి పరిచింది. ఇప్పటికే రెండు వారాల షూటింగ్ కూడా పూర్తి చేసారు.

ఆ షూట్ లో ప్రభాస్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ తో సహా హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిం చారు. ఇక ఈ సినిమా లో డార్లింగ్ సహా కథ  డిమాండ్ చేయడంతో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నసంగతి తెలిసిందే. నిధి అగర్వాల్...మాళవికా మోహనన్.. రిధ్ది కుమార్ లతో  డార్లిం గ్ రొమాన్స్ చేస్తున్నాడు. ఈ నలుగరు కాంబినేషన్ లోనే మారుతి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే తాజగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా లో  నటి స్తున్న నిధి అగర్వాల్ పట్ల మారుతీ కొంత అసహనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.

రెండు వారాల షూటింగ్ పుటేజీ చెక్ చేసుకున్న మారుతి నిధి సెట్ అవ్వడం లేదని.. ఆకాంబో లో సన్నివేశా లపై అసంతృప్తిగా ఉన్నారుట. దీంతో  నిధి అగర్వాల్ ని  సినిమా నుంచి తొలగించినట్లు వినిపిస్తుంది. ఇప్పుడామె స్థానంలో మెహ్రీన్ పిర్జాదాని తీసుకోవాలని భావిస్తున్నారుట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ ఇది తెగ హల్చల్ చేస్తుందని సోషల్ మీడియా లో .. దీనిపై చిత్ర బృదం తొందరయా క్లారిటీ ఇస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: