ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరూ కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగకు పోటీ పడబోతున్నారు. అంతేకాదు వీరి సినిమాలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర కూడా విడుదల చేసి అక్కడ పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్ లో ఇప్పటికే టికెట్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. అయితే బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వీరసింహారెడ్డి సినిమా టికెట్ బుకింగ్స్ తో పోల్చుకుంటే బాబీ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టికెట్స్ బుకింగ్ అధికంగా అమ్ముడుపోయినట్లు తాజా సమాచారం.

యూఎస్ఏ ప్రీమియర్ షోలలో వీరసింహారెడ్డి 10  స్థానాలలో.. 21 ప్రదర్శనలు ఇవ్వబోతోంది. ఇప్పటికే 373 టికెట్లు విక్రయించబడ్డాయి.  మొత్తం 6, 714 డాలర్ల సొంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్ , టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా 9 స్థానాలు కైవసం చేసుకోగా .. 22 ప్రదర్శనలు ఇవ్వబోతోంది.. 476 టికెట్లు కూడా విక్రయించబడ్డాయి.. మొత్తంగా 8,568 డాలర్లు ప్రీమియర్ షో కింద సొంతం చేసుకున్నట్లు సమాచారం.


యూఎస్ఏ లో ఇప్పటివరకు ప్రీమియర్ షో టికెట్ బుకింగ్ ను  బట్టి చూస్తే బాలయ్య వీర సింహారెడ్డి సినిమా కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ అమ్ముడుపోయినట్లు తాజా సమాచారం. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాలు ఎలా విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాయి.. ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తాయి.. అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పటికే చిరంజీవి,  బాలకృష్ణ ఎన్నోసార్లు సంక్రాంతి బరిలో పోటీపడ్డ విషయం తెలిసిందే.  మరి ఈసారి కూడా వీరిద్దరు పోటీ పడుతున్నారు.  అయితే ఇద్దరిలో ఎవరిది పై చేయి అన్నది సినిమా విడుదలయి కలెక్షన్స్ సాధించే వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: